@simplytelangana wrote:
ఈ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారికి కొందరు NRI ల పిల్లలు ముప్పై వేల రూపాయలు మిషన్ కాకతీయకు విరాళంగా ఇచ్చారు. ఐతే వారు ఇచ్చిన సొమ్ము వెనుక వారి కష్టం దాగి ఉంది, చెమటోడ్చి సంపాదించిన డబ్బులను మహత్తర కార్యక్రమమైన మిషన్ కాకతీయ కోసం ఇవ్వడం అందరిని ఆలోచింప జేసింది. వారివ్వాలనుకుంటే తల్లిదండ్రుల నుండి తీసుకొని ఇవ్వొచు లేదా వారి పాకెట్ మనీ నుండి కూడా ఇవ్వచ్చు, కానీ ఈ పిల్లలు అలా చేయలేదు. మిషన్ కాకతీయ గురించి తెలుసుకున్న వీరు ఈ కార్యక్రమములో భాగం కావాలని అందుకోసం పిల్లలంతా కలిసి వేసవి సెలవుల్లో, వారాంతపు సెలవుల్లో వారి కాలనీల్లో ఉండే కార్లను శుభ్రం చేయడం, ఇంటిముందుండే గార్డెన్ లను శుబ్రమ్ చేయడం, బిస్కెట్లు అమ్మడం లాంటివి చేసి ఈ పిల్లలు ముప్పై వేల రూపాయలు ఆర్జించారు. ఒక్కొక్క రూపాయి పోగేసి ముప్పై వేల రూపాయలు జమ చేశారు.
ఈ పిల్లల కు సంబంధించిన వివరాల్లోకి వెళితే ......
అమెరికా లో పుట్టి ఇక్కడ చదువుతున్న వాళ్ళు . సామాజిక సేవ చేయడం వీరు ఎంచుకున్న హాబీ. వీళ్ళంతా హిల్ కౌంటీ ఇంటరాక్టివ్ క్లబ్ పేరుతో సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. ఏడో తరగతి నుండి పన్నెండో తరగతి వరకు చదువుతున్న వాళ్ళు ఈ క్లబ్ లో సభ్యులు గా ఉన్నారు. చిరక్, డిల్లీ పబ్లిక్ స్కూల్, ఒకరిడ్జ్ లాంటి ప్రముఖ పాఠశాలలలో చదువుతున్న పిల్లలే.....హిల్ కౌంటీ ఇంటరాక్టివ్ క్లబ్ కు సాగర్ అధ్యక్షుడుగా వ్యవహరిస్తుండగా శ్రేయ, ఆదిత్య, నైనిక, ధీరజ్, సాకేత్, పరిణిక, సెరా చౌధరి, కిన్నెర, అభినవ్ చౌదరి లు సభ్యులుగా ఉన్నారు. ఈ రోజు మిషన్ కాకతీయ కు ఇచ్చిన ముప్పై వేల రూపాయల విరాళాన్ని వీరంధరు కలిసి వివిధ పనులు చేసి సంపాదించారు.
ఆర్&బి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గారితో కలిసి మంత్రి హరీష్ రావు గారికి చెక్కును ఈ రోజు సేక్రెటేరియట్ లో అందచేశారు. ఈ పిల్లల ఆలోచనా విధానం చాలా మందికి స్పూర్తి దాయకం అని అన్నారు మంత్రి హరీష్ రావు.